SAKSHITHA NEWS

నీచ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వం


సాక్షిత : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై అనర్హత వేటు బిజెపి ప్రభుత్వానికి సిగ్గుచేటని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ రెడ్డి. కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి. తర్నికల్ సర్పంచ్ పాండు గౌడ్అన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకనే బిజెపి ప్రభుత్వం ఇలాంటి నీతిమాలిన పనులకు పాల్పడుతుందనిప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కి బిజెపి ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తుందని దొంగలకు సద్దులు కడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రాలదోలడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దంగాఉన్నారని


ఇలాంటి బెదిరింపులకు,అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ వెనుకడుగేయదని ఉద్ధ్యేశ్యపూర్వకంగా,రాజకీయకక్ష్యపూర్వకంగానే చర్యలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం కాకుండా ప్రాణాలనే త్యాగం చేసిన కుటుంబమని మీకు దమ్ము,ధైర్యం ఉంటే అంశాలపై కొట్లాడాలనీ కానీ అధికార బలంతో ఏదైనా చేయొచ్చని అనుకుంటే ఇంతకన్న పిరికిపంద చర్య ఇంకోటి లేదనీ మీరు కాంగ్రెస్ పార్టీ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోతర్నికల్ సర్పంచ్ పాండు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ sc సెల్ శేకర్ ఆంజనేయులు వంశీ ఉదయ్ మైనర్టీ నాయకులు మహమూద్ భాయ్ శకీర్ కమృద్దిన్ ఎండీ రఫీ కదీర్ అరిఫ్ యూత్ కాంగ్రెస్ నియోజక వర్గం అధ్యక్షులు అనిల్ బాలరాజు బండి సుదర్శన్ కాంగ్రెస్ లీడర్స్ తలసాని పాండు బీసీ నాయకులు ఆంజనేయులు గణేష్ శ్రీకాంత్ మహేష్ గౌడ్ సంతోష్ రవికుమార్ మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS