SAKSHITHA NEWS

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)
విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి…
కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.
ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల గొంతుకగా పనిచేశా.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నల్గొండ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశా.
ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎన్నికల యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి.


ఉపాధ్యాయ విద్యారంగా సామాజిక సమస్యలపై శాసనమండలిలో నిరంతరం పోరాటమే తన ఎజెండా అని ఖమ్మం,వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల యుటిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోదాడ పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీగా తన పోరాటంతోనే ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యమాలు బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మరొకసారి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానన్నారు. విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కేంద్ర బడ్జెట్ లో విద్యకు 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాట్లకు 500 కోట్లు గ్రాంట్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు .మధ్యాహ్న భోజన కార్మికుల రేట్లు పెంచాలన్నారు. దీర్ఘకాలికంగా ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. తనకు ఉపాధ్యాయులు అంతా మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు ఆర్ ధన మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే మంగ, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, కే జ్యోతి, పాండురంగ చారి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS