డీజే సౌండ్స్ తో వెళ్లడమేనా పరామర్శ అంటే…
** జగన్ తుపాను ప్రాంత పర్యటనపై టీడీపీ రాష్ట్ర నేత
…..
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: జగన్మోహన్ రెడ్డి తుపాను బాధిత ప్రాంత పర్యటనను తన బలప్రదర్శనలా , ప్రచార యాత్రలా చేసి పోలీసుల సూచనలను ఉల్లంగించి కార్ల ర్యాలీతో… డీజే సౌండ్స్ తో టపాసుల మోతలు , పార్టీ శ్రేణుల వీరంగాలు , బెదిరింపులు , రప్పా రప్పా డైలాగులుతో వెళ్లడం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన చిత్తూరు టీడీపీ జిల్లా కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రిని సీఎం.. సీఎం నినాదాలతో ట్రాఫిక్ స్తంభింపచేస్తూ ప్రజలలో భయానిక వాతావరణం సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో 3 ఏళ్ళు రైతుల ఫసల్ భీమా ప్రీమియం కూడా చేయించకుండా , రైతులను ఆదుకోకుండా దగా చేసి ఇప్పుడు తగునమ్మా అంటూ రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేసారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి , వైకాపా తమ తీరు మార్చుకోకపోతే వైకాపాను ప్రజలు రాజకీయం గా భూస్థాపితం చేస్తారని సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్లో టిడిపి నాయకులు మోహన్ రాజ్ , యువరాజులు నాయుడు కూడా పాల్గొన్నారు. .
