ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలి
వైసిపి మహిళా నాయకురాలు
….
సాక్షిత :కోవూరు నియోజకవర్గ పరిధిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన తెలిపిన వై.యస్ ఆర్ సి పి మహిళా నాయకులు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు,మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల నిరసన ర్యాలీ..రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అని. నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలి అని కోవూరు మండలం లోని ఎక్సైజ్ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం అందజేసిన మహిళలు..అనంతరం వారు మాట్లాడుతూ ఈమధ్యం కూల్ డ్రింక్ కంటే ఈ మందు దారుణంగా దొరుకుతుంది..ఈ నకిలీ మధ్యాన్ని తక్షణమే అరికట్టాలి, ఆడపడుచులు చాలా ఇబ్బంది పడుతున్నారు..ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కవరగిరి శ్రీలత గంగవరం సర్పంచ్ లక్ష్మి కుమారి, ఇనమడుగు సర్పంచ్ ప్రమీలమ్మ, వైసీపీ నాయకురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
