వైసిపి కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ
…..
సాక్షిత :మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు
విద్య, వైద్యం రెండు కళ్ళుగా వై. యస్ జగన్ పాలన
28- 10-25 కోవూరు నిరసన ర్యాలీ
మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ముందుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి కోటి సంతకాల పోస్టర్ ను ఆవిష్కరించి తన మొదటి సంతకం తో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ మోసానికి తెర లేపారు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే సుపరిపాలన అంటారా. విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తుంటే వైఎస్ఆర్ సీపీ నేతలు చూస్తూ ఊరుకుంటారా విద్య వైద్యం రెండు కళ్ళగా వైఎస్ జగన్ పాలన సాగింది. జగనన్న పిలుపునిస్తే వారి అభిమానాన్ని ఎవరు ఆపగలరు గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు పునాదులు వేశారు. జగనన్న నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను అందజేయడమే గాక విద్యార్థులకు అండగా ఉంటాం. కూటమి నాయకులు చేసే ఈ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం “28 10 2025” కోవూరు నియోజకవర్గస్థాయి నిరసన ప్రదర్శన కార్యక్రమం కోవూరు మండలంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డా. అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొంటారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గస్థాయి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు,వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి,జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, ఏపీ డీఎల్ఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, వైసిపి యాక్టివిటీ విభాగ కార్యదర్శి నాలుబోలు సుబ్బారెడ్డి, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, బుచ్చి, విడవలూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, నవీన్ రెడ్డి, శేషగిరిరావు, సతీష్ రెడ్డి, గండవరం సర్పంచ్ యెడెం లక్ష్మి కుమారి, వైసిపి ఇంటి విజువల్స్ విభాగ కార్యదర్శి జిల్లా గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాములూరు వెంకటరమణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు జుబేర్ భాష, వైసీపీ నాయకులు బి.శ్రీధర్, కె.ప్రసాదు, జెట్టి శ్రీనివాసులురెడ్డి, సుధీర్,కిషోర్ రెడ్డి,గుణ్ణం జనార్ధన్,తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
