TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు..!!
TGPSC Group-1 2024: టీజీపీఎస్సీ గ్రూప్-1 విద్యార్థులు అలర్ట్.. రేపటి నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
హాల్ టికెట్లను వెబ్‌సైట్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కమిషన్ విడుదల చేసింది. కాగా.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.ఈ మేరకు అభ్యర్థులకు హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది.
హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. హైదరాబాద్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబడింది. 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ MBA, MCA కోర్సుల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 మరియు 16 తేదీల్లో జరుగుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మిగిలిన సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని, ప్రాధాన్యత ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చని కన్వీనర్ ఎ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.