SAKSHITHA NEWS

జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి తాత్కాలిక తొలగింపు?

హైదరాబాద్ :

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసుల నమోదు చేశారు. అయితే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది.

కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తప్పించా లని కమిటీ సిఫార్సు చేసింది. పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేక పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురయితే ధైర్యంగా ఫిర్యాదు చేయ వచ్చని..వారి వివరాలను గోప్యంగా ఉంచుతామం టూ స్పష్టం చేసింది.

హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన ఆ కమిటీ కన్వీనర్ దామోదర ప్రసాద్, చైర్ పర్సర్ ఝాన్సీ, సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, వివేక్ కూచిబొట్ల, ప్రగతి, సామాజిక కార్యకర్త రామలక్ష్మీ, న్యాయవాది కావ్య మండవలు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు.

అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెనకాడుతు న్నారని అన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి బాధిత యువ తి ముందే తమ కమిటీని ఆశ్రయించినట్లు వెల్లడించారు.

టాలెంట్ ఉన్న అమ్మాయి లకు పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు ఉంటన్నాయ న్నారు ఝాన్సీ. ఈ విష యంలో బాధిత యువతికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ, ఓ అగ్ర నటుడు ఛాన్స్ ఇచ్చా రని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యం లో గతంలో నియమించిన కమిటీ రిపోర్టు..బయటకు వస్తే పటిష్టమైన మార్గద ర్శకాలు రూపొందించుకు నేందుకు అవకాశం ఉంటుం దని ఝాన్సీ తెలిపారు.

గతంలో పరిశ్రమలు లైంగిక వేధింపుల కేసులు చాలా నమోదు అయ్యాయ ని..కొన్ని తమ దృష్టి రావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజా తెలిపారు. తమ కమిటీ ద్రుష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నా మని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్ప టికీ తమ వంత బాధ్యతగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలి పారు. అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలకు పరిశ్రమ భరోసా ఇవ్వక పోవడం వల్లే ఇలాంటి అఘాత్యాలకు పాల్పడు తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తంచేశారు.


SAKSHITHA NEWS