బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు..
బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
Related Posts
తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
SAKSHITHA NEWS తెలంగాణలో రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను…
40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్లు
SAKSHITHA NEWS 40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్లు 40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్లుహత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 40 రోజులుగా నిరసనలు చేస్తున్న…