
దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక స్థానం ఉంది -MLA బొండా ఉమ
సాక్షిత : సమాజంలో రాజకీయ పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు – MLA బొండా ఉమ
ఉదయం 11:00″గం లకు ” విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు గ్రామస్థాయి నుండి మహాసభలు జరుపుకుని నూతన కమిటీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది…
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా :- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు గారు హాజరయ్యి మాట్లాడుతూ:- 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ప్రజాస్వామ్యానికి పెద్దపేట వేసి నూతన కమిటీలను ఎంపిక చేసేటువంటి సాంప్రదాయం ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి నియమా నిబంధనల ప్రకారం ఈనాటికీ కూడా ఎందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా వివరించడం జరిగింది…
అనంతర కాలంలో నారా చంద్రబాబు నాయుడు మరింత అంతర్గతమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యకబంధంగా నూతన కమిటీలను ఎంపిక చేసేటువంటి సాంప్రదాయం కార్యకర్తల సమక్షంలోనే జరుగుతుందని దానిలో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 21 డివిజన్ లలో తెలుగుదేశం పార్టీ మరియు అనుబంధ సంఘాల శాఖల నూతన నాయకత్వం ఎన్నికకు శ్రీకారం చుట్టామని…
ఈరోజు 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను జరపడం జరిగిందని తెలుగుదేశం పార్టీలో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఇన్చార్జి ఉపాధ్యక్షులు కార్యదర్శుల పదవులు పదవుల కింద కాకుండా ప్రజా సేవకు చేసేటువంటి బాధ్యతగా ఎన్నికైనటువంటి డివిజన్ నాయకులు నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు…
ఈ డివిజన్ నూతన నాయకత్వం నిరంతరం డివిజన్ ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను ఇటు ప్రభుత్వం దృష్టికి అటు అధికారుల దృష్టికి స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వచ్చి సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారని కార్యాలయాలు డివిజన్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు డివిజన్ ప్రజానీకానికి అందుబాటులో ఉంచుతారని, దీనిని డివిజన్ ప్రజానీకం కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు…
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా డివిజన్ అధ్యక్షులుగా లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శిగా కోలా శ్రీను, ఇంచార్జి గా మోతుకూరి కాసిం లను ఎన్నిక చేయడం జరిగింది అని తెలియజేశారు…
ఈ సమావేశంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, బత్తుల కొండ, లబ్బా దుర్గా, మోదుగుల గణేష్, తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
