తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తుంది *
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తుందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు అన్నారు. చల్లపల్లి బైపాస్ రోడ్ లో 61వ బూత్ పరిధిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ మండల టీడీపీ విధానాలు నచ్చి సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, కళత్తూరి నాంచారయ్య, మల్లంపల్లి మాధవరావు, శామీరుపేట వెంకటేష్, లుక్క రాఘవులు, నడకుదుటి నరసింహారావు, మల్లంపల్లి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.