SAKSHITHA NEWS

తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి సమస్యలతో పోటెత్తిన బాధితులు

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’లో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ప్రజలు సమస్యలతో పోటెత్తారు. అర్హతలు ఉన్నా గత ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలు దక్కనివారు, వైకాపా నేతల భూకబ్జా బాధితులు, వివిధ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నవారు అర్జీలు ఇచ్చేందుకు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య గారితో కలిసి వారితో ఆత్మీయంగా మాట్లాడి వినతులు స్వీకరించడం జరిగింది. వారి బాధలను శ్రద్ధగా ఆలకించి తగు న్యాయం చేస్తామని భరోసా కల్పించడం జరిగింది. బాధితుల సమస్యలపై అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించాం


SAKSHITHA NEWS