బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ అమరుల స్థూపానికి నివాళులర్పించి, తెలంగాణ తల్లి, అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కఠోర దీక్ష, అచంచల సంకల్పం ఫలితమని అన్నారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది అమరుల త్యాగాల వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టి ఉద్యమాన్ని విజయవంతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు చరిత్రను విస్మరించి కేసీఆర్‌పై విమర్శలు చేయడం బాధాకరమని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన, రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదాలతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జహీద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, బూరుగు వంశీకృష్ణ, బొబ్బిలి సతీష్, కృష్ణస్వామి, పర్శ స్వాతి, మేకల రామస్వామి, బోట్ల పోషం, నడిపెల్లి సాయి, కడమండ్ల శ్రీహరి, కళాధర్ రెడ్డి, సురేందర్, రోడ్డ సంపత్, కరాటే రాములు, కడార్ల శ్రీధర్, సార్ల ఉదయ్, కొండ సురేష్, ఎస్కే మోహిన్, జక్కుల ప్రేమ్ కుమార్, యువరాజ్ నేత, కంకణాల దేవేందర్, దువాసి కార్తీక్, వీసం ప్రదీప్, పోయిల రవి, యుగేందర్, శ్రీకర్, ఎలకపల్లి అంజయ్య, ఎండి అన్ను, బండి రాజు, ఎస్కే షరీఫ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
