గొప్ప త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం.. అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పిస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్ ధూళికట్ట సతీష్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను స్థానిక రీగల్ షూమార్ట్ వద్ద ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో, 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బొంతల రాజేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బొంతల రాజేష్, 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్, శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
