SAKSHITHA NEWS

తెలంగాణ ఉద్యమ కెరటం,ప్రజా యుద్ధనౌక గద్ధర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఇవే మా ఘన నివాళులు :- మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తాజా మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

సాక్షిత : తెలంగాణ ఉద్యమ కెరటం ప్రజా యుద్ధనౌక గద్ధర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గద్ధర్ జయంతి వేడుకల్లో ఆ మహానీయుని చిత్ర పటానికి పలువురు నాయకులతో కలిసి కౌడే మహేష్ కురుమ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ విప్లవ గీత రచయిత,తెలంగాణ ఉద్యమ కెరటం,ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఆ మహనీయుడి జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా,సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తూ తాజా మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ తన కలం,గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని,సమాజంలో అసమానతలు,వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక అని స్మరించుకున్నారు.గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు,వారి పేరుతో అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా కవులు,కళాకారులు,సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కౌడే మహేష్ కురుమ.


ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్ సి సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్ (చింటు),మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు జాకట దేవరాజ్,కౌడే మహేష్ కురుమ,పెంజర్ల స్వామి యాదవ్,సముద్రం సాయి కుమార్,మర్రి శ్రీనివాస్ రెడ్డి,అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ,మేడ్చల్ మున్సిపాలిటీ,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లద్దిపీర్ల మురళీ గౌడ్,పత్తి శంకర్,రామన్నగారి సంతోష్ గౌడ్,సల్ల వెంకటేష్ యాదవ్,పెగుడ శ్యామ్ రావు,రాజబొల్లారం పాషా,నాగేష్,పుట్ట లక్ష్మీ నర్సింహ్మ ముదిరాజ్,నాగేష్ గౌడ్,సుదర్శన్,రాజు మేడ్చల్ మున్సిపాలిటీ,మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app