తెలంగాణ సంస్కృతి మతసామరస్యానికి నిదర్శనం
- ఎలికట్ట దర్గాలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలంగాణ సంస్కృతి మతసామరస్యానికి నిదర్శనమని, భిన్నత్వంలో ఏకత్వంలో ఇక్కడి ప్రజలు తమ ఇష్టదైవాలను కొలుస్తూ మోక్కులు తీర్చుకుంటారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామం లోని హజరత్ సయ్యద్ అబ్బాషా ఖాద్రీ చిస్తీ ఉర్ఫియాత్ పీర్ గయాబ్ షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మాట్లాడారు. దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా బాబాకు గంధం సమర్పించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా దర్గా కమిటీ సభ్యులు మౌలిక వసతులు కల్పించారని, వారు పనితీరు ఆదర్శనీయమని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలికట్ట గ్రామమాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు అశోక్ గౌడ్, దర్గా ఉర్సు నిర్వాహకులు అన్వర్, అజ్జు, అబ్బు, నరేష్ గౌడ్ లు పాల్గొన్నారు.