SAKSHITHA NEWS

Telangana Anti Narcotics Bureau in Hyderabad Necklace Road
  • హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వాకటి కరుణ ఐఏఎస్.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి ఘనంగా స్వాగతం పలికిన డిజిపి రవి గుప్తా, యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తదితరులు.
  • యాంటీ డ్రగ్ అవేర్నెస్ సాంగ్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • నెక్లేస్ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్

  • డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
  • మారకద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించం, ఉక్కు పాదంతో అణచివేస్తాం.
  • తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కనబడడానికి వీలులేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కఠిన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం.
  • రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైన కేటాయిస్తాం బడ్జెట్ సమస్యనే కాదు.
  • దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్సును సమూలంగా నివారించడం మనందరి బాధ్యత.
  • తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది తెలివైనది ఎంత దూరం వెళ్లి నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు కలది.
  • పోలీసులు వేసే ప్రతి అడుగు మనకోసమే అన్న భావనను పెంపొందించుకొని పోలీసు వారికి సహకరించాలి.
  • సంఘవిద్రోహ శక్తులు, అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడానికి కొందరు దుర్మార్గులు అలవాటు చేసే డ్రగ్స్ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును కోల్పోవద్దు.
  • ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగాలి. ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నది.
  • పన్నుల నుంచి వస్తున్న ప్రతి పైసను సద్వినియోగం చేస్తూ ఈ ప్రభుత్వం విద్యకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి మీ బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్నది.
  • తాత్కాలిక వ్యసనాలకు మీరు నష్టపోతే మీ తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం బాధపడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.
  • విద్యార్థులు యువత మంచి సహవాసంతో నడిచి భవిష్యత్తును మార్గదర్శనం చేసుకోవాలి.
  • ప్రశాంతంగా ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో డ్రగ్స్ విష ప్రయోగం లాంటిది.
  • భారతదేశ సమాజబలమే కుటుంబ వ్యవస్థ అలాంటి కుటుంబ వ్యవస్థకే ఇది చాలా ప్రమాదకరంగా మారింది.
  • దేశానికి బలీయమైన మానవ వనరులను నిర్వీర్యం చేయాలని దేశ ద్రోహులు చేసే కుట్రలో అంతర్భాగమే మాదక ద్రవ్యాల రవాణా.
  • అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు వేసి పోలీసులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం పెద్ద సమస్య ఏమి కాదు.

SAKSHITHA NEWS