ప్రజా సమస్యలపై గళమెత్తిన టిడిపి కౌన్సిలర్లు..

Sakshitha news

ప్రజా సమస్యలపై గళమెత్తిన టిడిపి కౌన్సిలర్లు..
….

సాక్షిత :+ *ప్రజా సమస్యల పై చిత్త శుద్ధి లేని వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరు


  • సాదా సీదాగా ముగిసిన కౌన్సిల్ సమావేశం..

చిలకలూరిపేట : స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ యొక్క సాధారణ సమావేశం ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలు చదివిన అనంతరం, ప్రజా సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు గంగా శ్రీనివాసరావు, జంగా సుజాత, బేరింగ్ మౌలాలి.పాములపాటి శివకుమారి లు గళమెత్తారు ముందుగా 38వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జంగా సుజాత మాట్లాడుతూ
గత వైసిపి హయాంలో ఎటువంటి కార్యక్రమాలు పనులు చేపట్టలేదు మా ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా
ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం డ్రైనేజీ పనులు కూడా జరగడం లేదని అన్నారు. దీనిపై కమిషనర్, ఇతర అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినా లాభం లేకపోయిందని, ఏ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. దీని పై మునిసిపల్ డిఈఈ అబ్దుల్ రహీం
మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియ లో ఉన్నాయని 6 వతేదిన టెండర్లు పిలవడం జరుగుతుందని వెంటనే పనులు కూడా చేపడతామని తెలిపారు.దీనిపై కౌన్సిలర్ సుజాత మాట్లాడుతూ కనీసం డ్రైనేజీ పనులు కూడా సరిగ్గా జరగడం లేదని, ఏళ్ళ తరబడి ఈ సమస్య కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం ఆ సమస్యనైనా పరిష్కరించాలని కోరారు. చైర్మన్ షేక్ రఫాని కలగజేసుకొని
వెంటనే పనులు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.

అధికారులు నోటీసులు ఇచ్చిన నిర్మాణాలు ఎలాజరుగుతున్నాయి..? శివకుమారి

చిలకలూరిపేట కౌన్సిల్ సమావేశంలో 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా వార్డు సమస్యల గురించి అధికారులను సూటిగా ప్రశ్నించారు,తన వార్డు పరిధిలో
చిలకలూరిపేటలో జరుగుతున్న అనధికార కట్టడాల గురించి ఆమె ప్రస్తావించారు.అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా కట్టడాలు ఎందుకు ఆగడం లేదు..?అనధికార కట్టడాలకు సెట్ బ్యాక్స్ ఎందుకు లేవు.. ఆ విధంగా నిర్మాణాలు చేస్తుంటే మీరు ఏమి చేస్తున్నారని భవనాలకు అనుమతులు ఎలా ఇస్తున్నారనీ నిలదీశారు..మీరు నిర్వాకం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎక్కడ పోతున్నాయో తెలుసా..?
ఎన్నడు లేని విధముగా పండరి పురంలో
నివాసాలలోకి వర్షం నీళ్లు వస్తున్నాయి.
హైవే పక్కన రోడ్లు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించారు.తన వార్డులో డ్రైనేజీల సమస్య వల్ల 100 కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె సమావేశం దృష్టికి తీసుకొచ్చారు..

రోడ్లు మరమ్మతులు కూడా చేయలేక పోతే ఎలా..? బేరింగ్ మౌలాలి

10వ వార్డు కౌన్సిలర్ బైరింగ్ మౌలాలి మాట్లాడుతూ గాంధీ పార్క్ వద్ద, అలాగే గడియార స్తంభం సెంటర్ వద్ద పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, వాటిని పూడ్చేందుకు ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు.పట్టణంలో పెద్ద పెద్ద పనులు ఎటు చేయడం లేదు ఎందుకంటే ఏమి అడిగిన కమిషనర్ నిధులు లేవు అంటున్నారు కనీసం ప్రధాన మైన రహదారుల్లో మరమ్మతులను కాస్త పెద్ద మనస్సు చేసుకొని చేయాలని లేని ఎడల గుంటల వల్ల ప్రమాదాలు సంభవించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతారని కనీసం రోడ్ల మరమ్మతులు,
ప్యాచ్ వర్కులు చేపట్టండి అని కోరారు.
గాంధీ పార్కు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స రూములు, కల్యాణి సెంటర్ వద్ద ఉన్న కొన్ని షాపుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటి నుంచి ఆదాయం రావడం లేదని తెలుస్తుంది.ముఖ్యంగా గాంధీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఆక్రమణల వల్ల షాపు రూములకి అద్దెలకు ఎవరూ రావడం లేదని అంటున్నారు. అక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి? ఎందుకని అక్కడ ఉన్న అక్రములు తొలగించడం లేదు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని ఎందుకు గండి కొడుతున్నారు. వెంటనే ఆక్రమణకు తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ రూములు అద్దెలకు ఇవ్వాలని, అద్దెలు చెల్లించని వారిని ఖాళీ చేయించి కొత్తవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆక్రమణల తొలగింపులో వివక్షత ఎందుకు..బేరింగ్ మౌలాలి..

చిలకలూరిపేట పట్టణంలో ఆక్రమణలు తొలగింపు అంటే గుర్తుకు వచ్చేది కేబీ రోడ్డు ఎన్.అర్.టి. సెంటర్ మాత్రమేనా ఇంకా పట్టణంలో ఎక్కడ ఆక్రమణలు లేవ వాటిని తొలగించరా..? కేవలం కేబి రోడ్, ఎన్.అర్ .టి.సెంటర్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆక్రమణలు తొలగించారని, మిగతా చోట్ల వదిలేశారని విమర్శించారు. చిరు వ్యాపారుల ఆక్రమణలను కూడా తొలగించారని, కానీ పెద్ద పెద్ద షాపులు,
అర్.వి.యస్.
హైస్కూల్ రోడ్డు.సబ్ రిజిస్టర్ రోడ్డు పేదనందిపాడు రోడ్డు, చీరాల రోడ్డు మెయిన్ బజార్. కల్యాణి సెంటర్ వద్ద ఉన్న షాపులను మాత్రం తొలగించలేదని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ త్వరలో బోర్డులు ఏర్పాటు చేస్తామని అనడంతో రెండు మూడు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని, ఆరోపించారు.
అధికారులు కేవలం బోర్డులు పెట్టి చేతులు దులుపుకుందామంటే కుదరదని వివక్షత లేకుండా
ఆక్రమణలన్నీ తొలగించాకే బోర్డులు పెట్టాలని తెలిపారు.

ధన్యవాదాలు తెలిపిన కౌన్సిలర్ కొత్త కుమారి..

పురపాలక సంఘ పరిధిలోని ఎనిమిదో వార్డు టిడిపి కౌన్సిలర్ కొత్త కుమారి మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లుగా కొన్ని అభివృద్ధి పనులు వార్డు పరిధిలో చేయాలని పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చిన ఎటువంటి అభివృద్ధి పనులు గత పాలనలో చేయలేకపోయారని. తెలుగుదేశం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్డు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి
వారి ఆదేశాలతో తన అవార్డులో ఉన్న ధీర్యకాలికమైన సమస్యలు పరిష్కరించడం జరిగిందని దీనికి
మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం వారికి డి ఈ.అబ్దుల్ రహీం కు వార్డు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేశారు దీంతో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మాట్లాడుతూ అజెండాలోని అంశాల పై ఎవరు అభ్యంతరం తెలపకపోవడంతో ఎజెండా ఆమోదిస్తున్నట్టు బెల్లు కొట్టి సమావేశం ముగిసింది అని తెలియజేశారు, ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై చిత్త శుద్ధి లేని పలువురు వైసిపి కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు