భక్తులకు అన్నదానం
** గణేశ పూజల్లో వైవిబి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని 34వ డివిజన్ రైల్వే కాలనీలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు గత నాలుగు రోజులుగా విశేష పూజలతో అన్నదాన కార్యక్రమాలతో భక్తులను, ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అండ్ రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి వినాయక చవితి వేడుకల నిర్వాహకులు సింగంశెట్టి సుబ్బరామయ్య స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి భక్తులకు, ప్రజలకు అన్నదానం చేశారు. సింగంశెట్టి సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైగా వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించు కొని ప్రతి ఏటా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నవరాత్రులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. ఆ వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్నీ శుభాలే కలగాలని కోరుకున్నట్లు సుబ్బరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ధనుంజయులు యాదవ్, మునిశేఖర్, సురేష్, జంగం ముని సుబ్రహ్మణ్యం, నైనార్ జగదీష్, సురేంద్ర రాజు, శేఖర్, గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుత్తణి వేణుగోపాల్ పాల్గొన్నారు.
