బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని సత్కరించిన తత్వమసి సేవా సమాజం కమిటీ సభ్యులు…
తత్వమసి సేవా సమాజం కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 6వ తేదీన సుచిత్ర చౌరస్తాలో నిర్వహించిన 18 పడుల మహా పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి కృతజ్ఞతలు తెలిపి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. మహా పడిపూజ కార్యక్రమం విజయవంతంలో నా సహాయ సహకారాలతో పాటు తత్వమసి సేవా సమాజ సభ్యుల సమన్వయం వల్లనే మహా పడిపూజ దిగ్విజయం అయ్యిందని, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దయ ప్రజలపై సంపూర్ణంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో తత్వమసి సేవా సంఘం సభ్యులు చంద్రం స్వామి, మురళీకృష్ణ స్వామి, జైహింద్ గౌడ్, నాగరాజు స్వామి, కృష్ణారెడ్డి స్వామి, శ్రీధర్ స్వామి, శివకుమార్ స్వామి, కుంట సిద్ధిరాములు గురుస్వామి, కృపాకర్ రాజు స్వామి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, నరేందర్ రెడ్డి, కాలే గణేష్, కుంట వేణు, బాల మల్లేష్, శ్రీకాంత్, విజయ్ హరీష్, జయరాం, రమేష్, వెంకటేష్ నాయి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
