విద్య ద్వారానే సమాజంలో ఎదుగుదల,గౌరవం మరియు గొప్ప స్థానం లభిస్తుంది.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
జగతగిరిగుట్ట ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు నేడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ సుమారు 160 మంది కి అల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణి చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్య ఏ ఒక్కరి సొత్తు కాదని,వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే నేడు అనేక ఉన్నత పదవులో ఉన్నారని,ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు,ఐపీఎస్ అధికారులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లేనాని అంత ఎదుగుదల ప్రభుత్వ పాఠశాలలో ఉందని కావున విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అని చెప్పుకున్నారని,కావున మన ప్రాంతంలో చదివే పిల్లలు అధికారులుగా ఎదిగి ఈ ప్రాంతానికి,ప్రజలకు సహాయం చేసి ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
విద్యార్థులకు మండల సహాయ కార్యదర్శి హరినాథ్,జర్నలిస్ట్ నాయకులు తొండ వెంకట్, బాబు, వంశీ లు కుడా పుస్తకాలను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు సుధాకర్,రత్నం లు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
