SAKSHITHA NEWS

జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
సాక్షిత: స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ, మరియు గడ్డం జై సాకేత్ లు
ఈ నెల 4 నుండి 10 వ తేదీ వరకు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా కోచ్ సాయికుమార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు జిల్లేపల్లి జానయ్య విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ చెస్ ఆడటం ద్వారా విద్యార్థుల మేధాశక్తిని పెంపొందుతుందని నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అంకితం కాకుండా వారి దృష్టి మళ్ళించడానికి చెస్ దోహదం చేస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లకు అలవాటు కాకుండా ఉండాలంటే వారిని ఆటల వైపు మళ్ళించాలని అన్నారు.


SAKSHITHA NEWS