చెత్త దుర్గంధంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టండి : అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద రాత్రి వేళల్లో చెత్తను అక్రమంగా డంపింగ్ చేయడం వల్ల దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి అక్రమ డంపింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా హిల్ కౌంటింగ్ వాసులు రాత్రి వేళల్లో అక్రమ చెత్త డంపింగ్ తో దుర్గంధం వస్తుందని ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో అక్రమంగా చెత్త డంపింగ్ చేస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, డిప్యూటీ ఎమ్మార్వో ప్రభుదాస్, బిఆర్ఎస్ పార్టీ ఎన్ఎంసి అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, రవికిరణ్, ఆగం రాజు, బొర్ర దేవి చందు ముదిరాజ్, ఏఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్రమౌళి, మేనేజర్ సౌమ్య, ఎన్విరాన్మెంటల్ ఏఈ సూకృతా రెడ్డి, సర్వేయర్ లక్ష్మి, వివిధ శాఖల అధికారులు , పలు డివిజన్ల అధ్యక్షులు, స్థానిక నాయకులు, హిల్ కౌంటీ వాసులు తదితరులు పాల్గొన్నారు.