SAKSHITHA NEWS

పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టండి.
కమిషనర్ ఎన్.మౌర్య

సాక్షిత తిరుపతి నగరపాలక సంస్థ:
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా ఉదయం బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్కును పరిశీలించారు. పార్కు నిర్వహణ సరిగా లేదని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మత్తులు చేయించాలని పలువురు వాకర్స్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. అన్నింటినీ పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ అన్నారు. అంతకముందు చేపల మార్కెట్ వెనుక గల మధురానగర్ మస్టర్ పౌయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు.

గైర్హాజరు అయినా వారిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. చేపల మార్కెట్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోందని, దుర్వాసన వస్తోందని ప్రజల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం పరిశీలన చేశారు. అన్నా క్యాంటీన్ల ను పరిశీలించి చిన్నచిన్న మార్పులను సూచించారు. తీర్తకట్ట వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, శ్రావణి, రాజు, డి.సి.పి. శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు అన్నారు.


SAKSHITHA NEWS