‘చెప్పాలని ఉంది’ యూత్ అంతా చూడాల్సిన సినిమా: ‘చెప్పాలని ఉంది’ ఆడియో రిలీజ్ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

‘Cheppalani Ertu‘ is a must watch movie for all youth: Minister Thalasani Srinivas Yadav at the audio release ceremony of ‘Cheppalani Ertu’ ‘చెప్పాలని ఉంది’ యూత్ అంతా చూడాల్సిన సినిమా: ‘చెప్పాలని ఉంది’…

H2O ఈవెంట్‌లు మరియు బ్రాండ్‌బైట్‌లు బిగ్గెస్ట్ న్యూ ఇయర్ “ఎలిజియం లైవ్ ఇన్ NYE కన్సర్ట్”

H2O Events and Brandbytes Biggest New Year “Elysium Live in NYE Concert” H2O ఈవెంట్‌లు మరియు బ్రాండ్‌బైట్‌లు బిగ్గెస్ట్ న్యూ ఇయర్ “ఎలిజియం లైవ్ ఇన్ NYE కన్సర్ట్” ఈవెంట్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర దర్శకుడు…

ప్రమోషన్స్ ప్రారంభించడానికి అయోధ్య ఆలయాన్ని సందర్శించిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ‘హను-మాన్’ చిత్ర యూనిట్  

Prashant Varma, Teja Sajja, ‘Hanu-Man’ film unit visit Ayodhya temple to start promotions ప్రమోషన్స్ ప్రారంభించడానికి అయోధ్య ఆలయాన్ని సందర్శించిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ‘హను-మాన్’ చిత్ర యూనిట్   క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఇటివలే విడుదలైన ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హను-మాన్‌ టీజర్ యావత్ దేశం హనుమంతుని నామం జంపించేలా చేసింది. నిన్న, దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించారు. టీజర్‌ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌ ను ప్రారంభించడానికి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ నిర్మాత: కె నిరంజన్ రెడ్డి బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణ: శ్రీమతి చైతన్య స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే డీవోపీ: దాశరధి శివేంద్ర సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్…

పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్‌టౌన్ పిక్చర్స్ ఎల్ ఎల్పీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మల్టీస్టారర్

A financial crime action multistarrer starring Satyadev, Dolly Dhananjaya, Satyaraj in the lead roles by Padmaja Films Pvt Ltd, Oldtown Pictures LP Film. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్‌టౌన్ పిక్చర్స్ ఎల్ ఎల్పీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మల్టీస్టారర్ పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్‌టౌన్ పిక్చర్స్ ఎల్ ఎల్పీ ఫిల్మ్ సంయుక్త నిర్మాణంలో సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్  ప్రధాన పాత్రలలో ఫస్ట్ జాయింట్ ఫీచర్ మల్టీస్టారర్ గా ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. చెన్నై బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ ఓల్డ్‌ టౌన్ పిక్చర్స్.. హైదరాబాద్‌ బేస్డ్ పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేతులు కలిపి సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌, అన్ని ఫార్మాట్‌ లలో సహకారం అందించనున్నారు. పెంగ్విన్ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ రచన, దర్శకత్వంలో హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ప్రాంతంలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం డెవలప్మెంట్ నిర్మాణ భాగస్వామ్యాన్ని ప్రారంభించారు.   ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ పాన్ ఇండియా చిత్రంలో తెలుగు నుండి సత్యదేవ్, కన్నడ నుండి ధనంజయ, తమిళం నుండి సత్యరాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రియా భవానీ శంకర్, సత్య అకల, సునీల్ వర్మ, జెనిఫర్ పిచినెటో ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండవ షెడ్యూల్ నవంబర్ 21 నుండి ప్రారంభమైయింది. ఫిబ్రవరి మొదటివారం 2023 వరకు షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో వేసవిలో విడుదల చేయనున్నారు.…

కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ విడుదల

Karthikeya and Neha Shetty’s ‘Bedurulanka 2012’ first look released under the direction of Clax and produced by Laukya Entertainments కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్…

నాని గారితో కచ్చితంగా సినిమా తీయాలి.. హిట్ ఇవ్వాలి.. డైరెక్టర్ శైలేష్‌ కొలను

I should definitely make a movie with Nani.. I should give a hit.. Director Shailesh Kolana నాని గారితో కచ్చితంగా సినిమా తీయాలి.. హిట్ ఇవ్వాలి.. డైరెక్టర్ శైలేష్‌ కొలను ‘హిట్ ది ఫస్ట్ కేస్’…

నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర ‘మట్టి కుస్తీ’లో చేశా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ

Challenging Role of My Career in ‘Matti Kusti’: Heroine Aishwarya Lakshmi Interview నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర ‘మట్టి కుస్తీ’లో చేశా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ‘ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో ‘మట్టి కుస్తీ’ విశేషాలని పంచుకున్నారు. ‘మట్టి కుస్తీ’ కథని ఎప్పుడు విన్నారు ? మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే  ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది.  దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా. ‘మట్టి కుస్తీ’ లో అంత సవాల్ గా అనిపించిన అంశాలేంటి? పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించా. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ‘మట్టి కుస్తీ’ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు. దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. ‘మట్టి కుస్తీ’ ఎలా ఉండబోతోంది?  ‘మట్టి కుస్తీ’ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ ‘మట్టి కుస్తీ’ కి కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్ తో పని చేయడం ఎలా అనిపించింది? విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. విష్ణు విశాల్ కి కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం.  ఆయనతో పని చేయడం చాలా అనందం గా వుంది. తెలుగు ప్రేక్షకులు గురించి మీ అభిప్రాయం ? తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే  బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షలులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. తెలుగు సినిమాలు చూస్తారా? మీ అభిమాన నటులు ఎవరు ? తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు. సాయి పల్లవి, సత్యదేవ్ లతో పరిచయం వుంది.…

‘హిట్ 2’… తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు:  ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

‘Hit 2‘… will definitely be a hit… no doubt: Director S.S. Rajamouli తెలుగు సినిమా నుంచి వ‌స్తోన్న మ‌రో క్వాలిటీ మూవీ ‘హిట్ 2’… తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు:  ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అడివి శేష్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE