‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్

‘Like Share & Subscribe’ Out and Out Hilarious Entertainer ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఒక ఫన్ రైడ్ లా వుంటుంది: దర్శకుడు మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ? ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ? లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్  కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం. ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్  ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది. మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది.  సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ? సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు. సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ? సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE