మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ టైటిల్ వాల్తేరు వీరయ్య, సంక్రాంతికి విడుదల
Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby, Maitri Movie Makers ‘Mega154’ Title Waltheru Veeriah, Sankranti Release మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ టైటిల్ వాల్తేరు వీరయ్య, సంక్రాంతికి విడుదల మెగాస్టార్ చిరంజీవి మెగా154 మేకర్స్ దీపావళికి ముందు విడుదల చేసిన మెగా154 గ్లింప్స్ ఒక మెరుపులా వచ్చి దీపావళి బ్లాస్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయడంతో ఎదురుచూపులకు తెరపడింది. చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవి సినిమాల నుండి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేశారు దర్శకుడు బాబీ. టైటిల్ టీజర్ లో.. భారీ ఓడలో కూర్చున్న విలన్ .. ” ఏంట్రా ఆడొస్తే పూనకాలు అన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఎడ్రా మీ అన్నయ్యా .. సౌండే లేదు” అన్న వెంటనే ఒక భారీ బ్లాస్టింగ్ సౌండ్ తో మొత్తం దద్దరిల్లిపోతుంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. స్టయిల్ గా కాల్చుతున్న బీడీతో మొత్తం షిఫ్ ని తగలబెట్టడం మెగామాస్ అనిపించింది. చిరంజీవి, బాబీల క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పవర్ బ్లాస్ట్ ఇంట్రోతో అందరి అంచనాలని అందుకుంది. టీజర్ టైటిల్ చూసిన ప్రేక్షకులు ‘వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్’ అని చెబుతున్నారు. మెగాస్టార్ గెటప్, వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ చిరంజీవి గత బ్లాక్ బస్టర్‌ల ఐకానిక్ పాత్రల గుర్తుకు తెస్తుంది. టైటిల్ టీజర్ లో మాస్ మహారాజా రవితేజ కనిపించనప్పటికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల తేదీని ప్రకటించారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి విడుదల కానుంది. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా పనితనం అత్యున్నతంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్రిలియంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ డిజైన్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్…