‘అనుకోని ప్రయాణం’45 ఏళ్ల నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి

‘Unexpected Journey‘ is one of the most memorable films in the 45-year-old actor’s career. ‘అనుకోని ప్రయాణం’ 45 ఏళ్ల నట జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో ఒకటి: ‘అనుకోని ప్రయాణం’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది.   నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ ‘అనుకోని ప్రయాణం’అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు.45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది. ఆనలుగురు లాంటి సమాంతర చిత్రాలు ఇండియాలో వందరోజులు ఆడాయి. ఇలాంటి ఎన్నో పరిక్షలు నేను ఎదురుకున్నాను. నా నట జీవితంలో అన్ని రకాల పాత్రలు చేశాను. దీనికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నరసింహ రాజు గారితో పాటు అన్నీ పాత్రలు గుర్తుంటాయి.  ‘అనుకోని ప్రయాణం’ లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒక అద్భుతంలా వచ్చే కథలివి. 28న సినిమా విడుదలౌతుంది. అద్భుతమైన, అమూల్యమైన అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. దయచేసి అందరూ ఫ్యామిలీ తో కలసి థియేటర్లో చూడండి” అని కోరారు. నిర్మాత డా.జగన్ మోహన్ డి వై మాట్లాడుతూ.. అంతా కొత్తవారితో సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. అలాంటి గట్స్ వున్న నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడా ఒక్క అవాంతరం లేకుండా సినిమా పూర్తి చేశాం. అయితే షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు కొంత ఎత్తు నుండి కిందకు పడ్డారు. అయితే దానిని లెక్క చేయకుండా షూటింగ్ ని కంటిన్యూ చేశారు. అనుకోని ప్రయాణం’ మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఇది. నరసింహ రాజు గారికి కృతజ్ఞతలు. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది” అన్నారు నరసింహ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో రెండేసి సినిమాలు చేశాను. వారిలో గొప్ప పట్టుదల కృషి వుంటుంది. ఒక లక్ష్యం గమ్యం తో పని చేసే గొప్ప నటులు వారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ఇందులో భాగం కావడం ఆనందంగా వుంది. అనుకోని ప్రయాణంలో చాలా మంచి నటీనటులు వున్నారు. సాంకేతిక నిపుణులు అంతా యంగ్ స్టర్స్. చాలా అద్భుతంగా చేశారు.  సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు. ప్రేమ మాట్లాడుతూ : చాలా రోజుల తర్వాత పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.  రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేయడం మంచి అనుభవం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా లో చాలా మంచి ఫీల్ వుంటుంది. అక్టోబర్ 28న సినిమా విడుదలౌతుంది. మీ అందరూ చూసి అనందించాలి’అని కోరారు. దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల మాట్లాడుతూ.. ఈ కథ వినగానే వెంటనే చేద్దామని చెప్పి మమ్మల్ని గొప్పగా ప్రోత్సహించిన రాజేంద్ర ప్రసాద్ గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో చాలా ఫన్ వుంటుంది. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి వల్లనే సాధ్యమైయింది. ప్రేక్షకులు కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.  ఇలాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ గారే చేయాలి. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు లాంటి లెజెండ్స్ తో పని చేయడం ఆనందంగా వుంది. ప్రేమ గారు కథ నచ్చి చేశారు. చాలా మంచి నటీనటులు, అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ వున్నసినిమా ఇది. ప్రేక్షకులని అలరిస్తుంది” అన్నారు.  శివ దినవహి మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్ గారు మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు గారి నటన చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతగొప్పగా చేశారు. అందరినీ అలరించే సినిమా ఇది” అన్నారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE