SAKSHITHA NEWS

Suryapet should be made a drug free district within 30 days.*

మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని మదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి.
సూర్యాపేట ను 30 రోజుల్లో డ్రగ్ ఫ్రీ జిల్లగా చేయాలి.*
విద్యార్థుల ప్రవర్తన పై తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలి.*
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు.*


సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : జిల్లాలో మదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టవలసిన చర్యలపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల కలిగే నష్టాలను యువతకు అవగాహన పరిచేందుకు విస్తృత ప్రచారం కల్పించి, సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చాటానికి సంబంధిత అధికారులు అందరూ క్రుషి చెయాలన్నారు. జిల్లాలో ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల అలవాట్లను, నడవడిని పరిశీలించాలని మాదకద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన అలవాట్లను గమనిస్తూ ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలను తెలంగాణ సాంస్కృతిక సారధులు 12 మండలాలలో, పోలీస్ కళాబృందాలు 11 మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం జూవైనల్ యాక్ట్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులకు ఆశా, అంగన్వాడీలు, ఏఎన్ఎం లు బృందాలుగా ఏర్పడి మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ముందుగా తల్లిదండ్రులకు తెలపాలని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి 15 రోజులు మండల కేంద్రాలలో తరువాత మున్సిపాలిటీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలోని చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను చెక్ చేయాలని డ్రగ్స్ గంజాయి వంటి పదార్థాల రవాణాను అరికట్టటానికి ఆర్టిఐ అధికారులు,ఎక్సైజ్, పోలీసు అధికారులు అన్ని చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టంగా చెక్ చేయాలి అన్నారు. పశువుల రవాణా నియంత్రించేందుకు చెక్ పోస్ట్ ల వద్ద పశు సంవర్ధక శాఖ అధికారులను నియమించాలని ఎస్పీ తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులు ,మత్తు నిచ్చే మందులను ఇవ్వకూడదని ఎస్పీ తెలిపారు. అన్ని పాఠశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవేయాల పట్ల కలిగే నష్టాలను వివరించాలన్నారు .

ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, జెడ్పి సీఈవో వి వి అప్పారావు, డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం, ఆర్డీవోలు సూర్యాపేట వేణుమాధవ్, కోదాడ సూర్యనారాయణ, సి సెక్షన్ సూపర్డెంట్ శ్రీనివాసరాజు, డిపిఓ సురేష్ కుమార్, డీ డబ్ల్యూ ఓ వెంకటరమణ, డిఇఓ అశోక్, డి ఐ ఈ ఓ కృష్ణయ్య, ఆర్టీవో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,

WhatsApp Image 2024 06 14 at 17.34.38

SAKSHITHA NEWS