పెండింగ్ వేతనాల కోసం దీక్ష చేపట్టిన మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపిన……….. బిఆర్ఎస్
*సాక్షిత వనపర్తి:
వనపర్తి మున్సిపాలిటీ లో
శానిటేషన్ కార్మికులుగా,వాటర్ వర్కర్స్,డ్రైవర్లు గా పనిచేస్తున్న 17మంది కార్మికులు 9నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని దీక్ష చేస్తున్న మున్సిపల్ కార్మికుల శిబిరాన్ని బి.ఆర్.ఎస్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పి.రమేష్ గౌడ్,మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, కంచె.రవి లు మాట్లాడుతూపట్టణ పరిశుభ్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు సకాలములో చెల్లించకపోవడం దురదృష్టకరం అని చేసిన పనికి వేతనాలు అడిగితే వారిలో చీలికతెచ్చి భయబ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని అధికారులు,పాలకులు వెంటనే స్పందించి చర్చలు జరిపి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
బి.ఆర్.ఎస్ నాయకులు అందుబాటులో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రెడ్డిని సంప్రదించగా వారిని దినసరి కూలీలుగా తీసుకున్నామని పనిచేసిన వారికి జీతాలు చెల్లించమని పైఅధికారులకు నివేదిక ఇచ్చామని నిర్ణయం తీసుకోవాల్సింది కమిషనర్ రని వివరించినట్లు వారు తెలిపారు
కార్మికులతో చర్చలు జరిపి దీక్ష విరమింపజేయాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్,సూర్యవంశపు.గిరి,యుగంధర్ రెడ్డి,వజ్రాల.రమేష్ ఉన్నారు.
నందిమల్ల.అశోక్
జిల్లా మీడియా కన్వీనర్ ఉన్నారు