SAKSHITHA NEWS

విజయవంతంగా ముగిసిన సీఎం కప్ 20 24 కొడిమ్యాల మండల స్థాయి క్రీడలు

జిల్లా స్థాయిలో కొడిమ్యాల మండల జట్లు విజయం సాధించాలి..ఎంపీడీవో
స్వరూప ,ఎస్సై సందీప్

కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం రోజున సీఎం కప్ 2024 కొడిమ్యాల మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీల ముగింపు ,బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమము నిర్వహించారు. కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర అధ్యక్షత వహించారు. మండల స్థాయి పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎంపీడీవో స్వరూప, ఎస్సై సందీప్, ఎంఈఓ శ్రీనివాస్ లు బహుమతులు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో స్వరూప, ఎస్సై సందీప్ ,ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ కోడిమ్యాల మండలంలో విజయం సాధించిన జట్లు జగిత్యాల జిల్లాలో, అనంతరం రాష్ట్రస్థాయిలో సీఎం కప్ సాధించాలని వారు పిలుపునిచ్చారు.

పోటీలకు బహుమతులను అందించిన ఏఎంసి వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డిని మండల అధికారులు అభినందించారు. క్రీడల విజయవంతానికి కృషిచేసిన అధికారులకు, ఉపాధ్యాయులకు, పిడీలకు, ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో స్వరూప కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, ఎస్సై సందీప్, ఎంఈఓ అయిత శ్రీనివాస్, జిహెచ్ఎం విజయేంద్ర, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య,తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మండల శాఖ అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ఉపాధ్యాయులు హమీదుల్లా, ఖాన్ ,మన్మధ రెడ్డి, తిరుపతిరెడ్డి, అంజయ్య ,కళ్యాణ్, క్రాంతి కుమార్ ,విమల, విజయలక్ష్మి, రమాదేవి, లక్ష్మీరాజ్, వివిధ పాఠశాలల పీడీలు బీరయ్య, శివకృష్ణ, అనుప రెడ్డి, గంగజల ,ప్రదీప్, సీనియర్ క్రీడాకారులు ఎండ్రికాయల శ్రీనివాస్ , వివిధ గ్రామాల క్రీడాకారులు, విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS