గ్రామ పంచాయతీ కార్మికుల మహాసభలను విజయవంతం చేయండి
మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
సాక్షిత :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 18న శనివారం జరిగే గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు చిక్కుల శ్రీను, గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున సిఐటియు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు తక్షణమే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, జీపీ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, కార్మికుల సమస్యల పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని, కార్మికులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, మట్టి ఖర్చులు 50 వేల రూపాయలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మహా సభలు అతి ముఖ్యమైన మహా సభలు ఈ మహా సభలలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారానికి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేస్తారని ఈ మహా సభలలో గ్రామ పంచాయతీ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కోశాధికారి వర్క రుక్మధరావు, నాయకులు మేకల రమేష్, పసుపులేటి రామారావు, కమ్మంపాటి నాగరాజు, సతీష్ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
