మండలంలో అంబులెన్స్ సేవలు అమోఘం
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని చింతపేట గ్రామానికి చెందిన రవ్వా మౌనిక శనివారం రోజున పురిటి నొప్పులు రావడంతో స్థానిక ఆశా కార్యకర్త 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఏంటి కళాధర్, పైలెట్ రాజా వెంటనే స్పందించి బాధితురాలు వద్దకు చేరుకొని అంబులెన్స్ లోనికి ఎక్కించి వైద్య పరీక్షలు నిర్వహించి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువ అవడంతో అంబులెన్స్ పక్కన నిలిపి అంబులెన్స్ లోనే కాన్పు చేయడం జరిగింది. రవ్వా మౌనిక పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని, తల్లి బిడ్డని స్థానిక మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది అని 108 సిబ్బంది ఈఎంటి కళాధర్, పైలెట్ రాజా తెలియజేశారు. 108 సిబ్బందిని మౌనిక కుటుంబ సభ్యులు,మండల ప్రజలు అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
