SAKSHITHA NEWS

కష్టపడి చదివి మంచి డాక్టర్ అవ్వాలి

-సత్యసాయి సేవ సమితి ఖమ్మం కన్వీనర్ ఆలిశ్యం నరసింహారావు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న తల్లితండ్రులు లేక తాత సంరక్షణలో వున్న శ్రీ హర్షిత అను ఒక నిరుపేద విద్యార్థినికి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో సీట్ వచ్చి ఆర్థిక ఇబ్బందుల వలన చదువుకు ఇబ్బంది అవుతున్నదని తెలిసి ఆ విద్యార్థినికి పుట్టపర్తి సాయిబాబా స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం సత్యసాయి సేవా సంస్థ తరఫున 25,000 రూపాయల విలువ చేసే ఆమె చదువుకు అవసరమైన మెటీరియల్ మరియు కొంత నగదు మొత్తం ఆదివారం వారి గ్రామమునకు వెళ్లి ఆ విద్యార్థినికి అందచేయుట జరిగినది. ఈ మహత్తర సేవా కార్యక్రమములో ఖమ్మం సమితి కన్వీనర్ ఆలస్యం నరసింహారావు, యూత్ సభ్యుడు జె.సతీష్ కుమార్, సమితి సభ్యులు ఆర్.నాగరాజు ( పీహెచ్బీ ఇన్స్ట్రక్టర్ ) మరియు వి. సైదులు పాల్గొన్నారు. ఇటువంటి తోడ్పాటు నందించే సేవా కార్యక్రమములో పాల్గొనే అవకాశము కలిగించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ, ఇలాగే ఆ చిరంజీవి యొక్క చదువుకు ఎలాంటి విఘ్నం లేకుండా చదువు పూర్తి చేయించమని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము అని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.


SAKSHITHA NEWS