SAKSHITHA NEWS

విద్యార్థులు సైబర్ క్రైమ్ భారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి : ఏస్ఐ నీలిమ

గౌరవనీయులైన సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో సూర్యాపేట రూరల్ మండలం కేంద్రంలో గల చందన నర్సింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో 300 బాలికలుకు సూర్యాపేట జిల్లా ఇన్ చార్జి ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు నిరంతరం శ్రమించాలని, మహిళలు, పిల్లల భద్రతల కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని, బాలికలకు ఆత్మ రక్షణకు సంబంధించిన పద్ధతులను నేర్పించడం జరిగింది. మహిళలు విద్యార్థులు ఆపద సమయంలో డయల్ 100 మరియు జిల్లా షీ టీమ్ నెంబర్ 8712686056 లేదా క్యూఆర్ కోడ్ ద్వారా తమకు ఎలాంటి వేధింపులు జరిగిన ఫిర్యాదు చేయవచ్చు అని, మహిళలు, ఆడపిల్లలు మౌనంగా ఉండి భరించవద్దని షీ టీమ్ ను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించుకోగలరని విద్యార్థులకు సూచించడం జరిగింది. టిసేఫ్ యాప్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. తాము గాని, తమ కుటుంబ సభ్యులు గానీ సైబర్ క్రైమ్ బారిన పడి ఎకౌంటు నుండి డబ్బులు పోగొట్టుకున్న యెడల 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకున్న యెడల తమ డబ్బులు తాము తిరిగి పొందగలరు అని తెలియజేయడం జరిగింది. షీ టీం సిబ్బంది రద్దీ ప్రదేశాలలో, బస్టాండ్లలో, కళాశాలలు ఉన్న ప్రాంతాలలో మఫ్టీ లో ఉండి ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేసి పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడతాయి. మహిళలు ఉన్నచోటు నుండే ఫిర్యాదు చేయవచ్చునని వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆకతాయిలపై మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని వారి వివరాలు గోప్యంగా వుంటాయని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది ఏఎస్ఐ సాలయ్య , హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి. చందన నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS