SAKSHITHA NEWS

విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
-ఇండక్షన్ ప్రోగ్రామ్ లో వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు
సాక్షిత రాజానగరం, :
తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నెరవేర్చేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని, ఉన్నత లక్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నూతనంగా ఇంజనీరింగ్ లో ప్రవేశం పొందిన విద్యార్థులకు దీక్షారంభ్ పేరుతో ఇండక్షన్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. మంగళవారం యూనివర్సిటీ సెమినార్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మొదటి సంవత్సరం విద్యార్థులుగా చేరిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఉద్యోగులుగా మాత్రమే కాకుండా గొప్ప ఇంజనీర్లుగా పారిశ్రామికవేత్తలుగా ఆకాంక్షించారు.

నాలుగు సంవత్సరాలు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ ఇంజనీరింగ్ ల్యాబ్స్, లైబ్రరీ, ఎన్.ఎస్.ఎస్, స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ర్యాగింగ్ రహిత విశ్వవిద్యాలయంగా చక్కని వాతావరణంలో ఉందని విద్యార్థులు దీనిని కొనసాగించాలని తెలిపారు. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను, ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు కృషి చేసి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ మాట్లాడుతూ క్యాంపస్ లో ఇంజనీరింగ్ చదువుతున్న నాలుగు సంవత్సరాలు దీక్షగా సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. ప్రిన్సిపాల్ డా.పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎ.ఐ.సి.టి.ఈ గుర్తింపు పొందిన నాణ్యమైన ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుందని విద్యార్థులంతా వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. 24వ తేదీ వరకు ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుందని చివరి రోజు రాజమహేంద్రవరంలోని వివిధ ప్రాంతాలను పర్యటించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు డా బి కెజియా రాణి, బి సుధా కిరణ్, జె హనుమంతు, బి లక్ష్మి, డా జి కీర్తి మారిటా మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

రైటప్ సమావేశంలో మాట్లాడుతున్నవీసీ ఆచార్య వై శ్రీనివాసరావు

WhatsApp Image 2024 08 20 at 18.24.14

SAKSHITHA NEWS