SAKSHITHA NEWS

జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు

పలు విభాగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించిన – ప్రిన్సిపల్ పిడి రాజు

సాక్షిత కమలాపూర్ :

కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉమ్మడి జిల్లా స్థాయిఆటల పోటీలలో పలు విభాగాలలో ప్రతిభ కనబరిచారు అండర్ 17 వాలీబాల్ లో ఎం సంగీత ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉమ్మడి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ అయింది. అండర్ 17 వాలీబాల్ ఆటలలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎంపీసీ ఫస్టియర్ నాగమణి ద్వితీయ స్థానంలో నిలిచింది పురుషుల విభాగంలో అండర్ 17 రెజ్లింగ్ పోటీలలో నైన్త్ క్లాస్ విద్యార్థి వినీల్ కుమార్ ఉమ్మడి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికయ్యాడు మరి కొంతమంది కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు, కమలాపూర్ మోడల్ స్కూల్ నుండి జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయిలకు ఎన్నికైన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు


SAKSHITHA NEWS