నామినేషన్లకు పోలీసు పటిష్ట బందోబస్తు
సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్..
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట రూరల్ పరిధి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నామినేషన్ల సందర్భంగా యర్కారం, బాలెంల, రామచంద్రపురం, పిన్నాయి పాలెం, కేసారం, ఇమాంపేట, ఎండ్లపల్లి గ్రామాల్లో సర్పంచి ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియను సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్ పరిశీలించి పోలీసు సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దు అని నామినేషన్ కేంద్ర అధికారి నిర్ణయాలను అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలో ప్రజలతో మాట్లాడి ఎన్నికల నియమావళి గురించి అవగాహన కల్పించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
