నీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు
** వార్డుల పర్యటనలో ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని 7 లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకుని నీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ చార్జి కమిషనర్ శారదాదేవి కోరారు. ఉదయం నగరంలోని 39, 41 వార్డులు చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీ లో ఇంజినీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి కమిషనర్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మరమ్మత్తులకు గురైన బోర్లలోని కలుషిత నీరు తాగడం వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
మురుగునీటి కాలువలు, రోడ్డు సరిగా లేవని, త్రాగునీరు సరిగా రావడం లేదని, పాడైపోయిన బోర్లను తీసివేయాలని కోరారు. పాడైన బోర్లను మరమ్మతులు చేసినా నీటి కలుషితం వలన రోగాలు వస్తాయని, వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు ప్రజలకు సరిపడేన్ని, ఒక నిర్థిష్ట సమయంలో సరఫరా చేయాలని తెలిపారు. కాలువలు, రోడ్లు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుధ్థ్య పనులు మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు శిల్ప, గోమతి, తేజస్విని, డి.ఈ వెంకట ప్రసాద్, ఏసిపి మూర్తి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, సుమతి, ఆర్.ఐ.నరేష్ తదితరులు ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY