అమ్మవారి ఆలయం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం

Sakshitha news

అమ్మవారి ఆలయం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రత్యేక పూజలతో టీటీడీ ప్రారంభించింది. ఇక్కడి
ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఆలయ సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


ఈ ప్రథమ చికిత్స కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు. ఈ కేంద్రం ద్వారా భక్తులకు, తిరుచానూరులో పనిచేసే సిబ్బందికి తక్షణ వైద్య సేవలు, ఫస్ట్ ఎయిడ్, సాధారణ చికిత్సలు అందిస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి, అవసరమైతే ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించే ముందు రోగులను స్థిరపరిచే సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో సీఎంవో డాక్టర్ బి.కుసుమకుమారి, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top