SAKSHITHA NEWS

–జిల్లా కలెక్టర్
పి. రాజాబాబు

పామర్రు

ఈ నెల 29 వ తేదీన కృష్ణాజిల్లా పామర్రులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు.

ఆదివారం సాయంత్రం పామర్రు లోని ఆరెపల్లి కళ్యాణ మండపంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వారికి అప్పగించిన విధులను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రోటోకాల్ నిబంధనలు మేరకు పకడ్బందీగా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు.

అంతరం కార్యక్రమం జరిగే ప్రధాన వేదిక, హెలిపాడ్ , రోడ్ షో మార్గాన్ని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. గ్యాలరీ పార్కింగ్, బ్యారికేడింగ్, సభాస్థలి వద్ద ఏర్పాట్లు తదితర అంశాల గూర్చి చర్చించారు.

అదేవిధంగా కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.v

వేదిక సమీపంలో అంబులెన్స్, అవసరమైన మందులు, ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు హాజరైన ప్రజలకు తాగునీరు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయాం ఆస్మి జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏఎస్పి (అడ్మిన్), జి.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం ఆర్డిఓ లు, డి రాజు, పి పద్మావతి, ఎం. వాణి, డ్వామా , డిఆర్డిఏ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు జీవ సూర్య నారాయణ, పిఎస్ఆర్ ప్రసాద్, సువర్ణ, డీఎస్పీ పి.శ్రీకాంత్, డిపిఓ నాగేశ్వర నాయక్, డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతాబాయి, రహదారులు భవనాల ఈఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఈఈ భాస్కర్ రావు, రోడ్డు రవాణా సంస్థ మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజుతో పాటు పలు శాఖల అధికారులు సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.


SAKSHITHA NEWS