చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై నిరంతర నిఘా
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్
25 లీటర్ల నాటు సారా, 3 కేజీల కరక్కాయ స్వాధీనం, 2,500 లీటర్ల బెల్లపు ఊట ద్వంసం
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నాటు సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, సెబ్ అధికారులు సంయుక్తంగా 40 మంది పోలీస్ సిబ్బంది వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద గ్యాంగ్, చిన్న బేతపూడి, వృక్షనగర్ తదితర ప్రాంతాలలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నాటు సారా, ఇతర అసాంఘిక కార్యకలాపాల కట్టడి చేసే ఉద్దేశంతో నిర్వహించిన కార్డాన్ అండ్ సెర్చ్ లో పోలీస్ అదికారులు 2,500 లీటర్ల బెల్లపు ఊట ను ద్వంసం చేసి, 25 లీటర్ల నాటు సారా, 3 కేజీల కరక్కాయలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.