బలం కాదు బలగాన్ని పెంచుకోవాలి – బలగం కొమరయ్య
— బంధాలు బాంధత్వాల గురించి పిల్లలకు నేర్పించండి
— చిచ్చాలలో సందడి చేసిన బలగం కొమరయ్య
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించేలా బంధాలు బంధుత్వాల గురించి తెలిపిన సినిమా బలగం. ఆ బలగం సినిమాలో కొమురయ్య తాతగా నటించిన కొమురయ్య అలియాస్ కేత్రి సుధాకర్ రెడ్డి చిట్యాల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యాదగిరి,పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్, నగేష్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం కొమురయ్య మాట్లాడుతూ ఈ రోజుల్లో ఏదైనా నా సొంతమని జీవిస్తున్నారు కలసి ఉంటే కలదు సుఖమని అందరూ కలిసి ఉండాలి బలం పెంచుకోవడం కంటే బలగం పెంచుకోవాలి సంపాదన కంటే బలగం పెంచుకోమని తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలకు బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాలు పెద్దలను గౌరవించడం వంటి విషయాలను తల్లిదండ్రులు నేర్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రఘుపతి రెడ్డి ఆదిత్య,మల్లేష్, మొహీనుద్దీన్, శేఖర్,నవీన్, శ్రీలత, పుష్పలత, లావణ్య, అయేషా, సత్యవతి, రాము,సత్యం,జ్యోతి, బాలమణి, దివ్య,రాధిక, అన్మొల్, రాణి, రజిత, సౌమ్య, నజీమా,విద్యార్థినీ విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.