రాజన్న జిల్లాల్లో వీధి కుక్కల హల్ చల్
నలుగురు చిన్నారులపై దాడి
రాజన్న జిల్లా :
రాష్ట్రంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తు న్నాయి.
గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్ర అనే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరి చాయి,
వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ హాస్పి టల్‌లో చేర్పించారు. కాగా, వీధికుక్కల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
అధికారులు, ప్రజాప్రతి నిధులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు…