వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదు… రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ మరియు పద్మా నగర్ ఫేస్ -2, గణేష్ నగర్ సంక్షేమ సంఘాల సభ్యులతో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ” సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా పద్మా నగర్ ఫేస్ -2 లో వక్ఫ్ బోర్డ్ పేరుతో పైసా పైసా కూడా బెట్టి కొంటున్న స్థలాలకు, అపార్ట్మెంట్లకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలుపుదల చేయడం సరికాదని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే పునఃప్రారంభించాలన్నారు. వక్ఫ్ బోర్డు సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఆర్, డిఐజి లతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే పునః ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పద్మా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తి రెడ్డి, గణేష్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు దుర్గారావు మరియు పద్మా నగర్ ఫేస్ -2, గణేష్ నగర్ వాసులు సతీష్ రెడ్డి, సత్యం, ఓబుల్ రెడ్డి, అప్పారావు, రామారావు, సత్యనారాయణ, ప్రసాద్, వెంకట్ రావు, ప్రకాష్, రంగారావు, రాజేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.