రాజీవగృహకల్పలో జరుగుతున్న భూకబ్జాలను అరికట్టండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
జగత్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లో బ్లాక్ నంబర్ 12,24,32 ల వద్ద గల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని వెంటనే ప్రభుత్వ భూములను కాపాడాలని నేడు సిపిఐ నాయకత్వం కుత్బుల్లాపూర్ రెవిన్యూ అధికారి రెహమాన్ కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవగృహకల్ప పక్కన ప్రభుత్వ భూమి ఉందని దానిపై నేడు కబ్జాదరుల కన్నుపడిందని,బ్లాక్ నంబర్ 24,32,12 ల పక్కన ఉన్న ప్రభుత్వభూమిలొ గతంలో నిర్మాణాలు చేపడితే అధికారులు కూల్చివేశారని,నేడు మళ్ళీ తిరిగి కబ్జాలకు గురయిందని,తప్పుడు పత్రాలు సృష్టించి సుమారు 30 లక్షలకు అమ్మినట్టు ప్రచారం జరిగుతున్నదాని కావున వెంటనే విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయం పై అనేక పత్రికలొ కూడా కథనాలు వచ్చాయని అన్నారు. అలాగే ప్రభుత్వ సూచికలైన లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విదంగా అంగన్వాడీ సెంటర్ లేక వ్యాయమ శాల,గ్రంధాలయం లాంటి వాటి కోసం కేటాయించాలని కోరారు.
లేని పక్షంలో హైడ్రా కు కూడా కంప్లైంట్ ఇస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం,కార్యవర్గ సభ్యులు హరినాథ్,సిపిఐ నాయకులు సామెల్,రవి, రాములు,యాదగిరి ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.