పిడుగురాళ్ల — గురజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 10 వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలనందు ప్రపంచ మాదక ద్రవ్యాల రవాణా వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా విద్యార్థి, విద్యార్థినులకు న్యాయవాదులచే న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. బార్ ప్రెసిడెంట్ ఎస్.కె జానీ భాష మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా మాదకద్రవ్యాలకు అలవాటు పడితే అతని ఆరోగ్యం చెడిపోయి ఇబ్బందులకు గురవుతారని అన్నారు. న్యాయవాది కలివేల ప్రభుదాసు మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడితే తనతో పాటు తన కుటుంబాలకు కూడా నష్టం చేసినట్లేనని అందువలన మాదగద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరినారు. న్యాయవాది బి జ్ఞానసుందరి మాట్లాడుతూ మీరు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అదాలత్ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినిలు
పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి
Related Posts
పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి
SAKSHITHA NEWS పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న dy.cm పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను,…
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన
SAKSHITHA NEWS ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణమండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు…