చిలుకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు…. ప్రారంభకులు ఎస్సై హనుమాన్ నాయక్..*
సాక్షిత ప్రతినిధి చిలుకూరు :
చిలుకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభింస్తున్న ఎస్ఐ హనుమాన్ నాయక్, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య .
సంక్రాంతి పండుగ సందర్భంగా చిలుకూరు యువకులు చిలుకూరు జెడ్పీ
పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ‘ఎస్ఐ హనుమాన్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిన ఉల్లాసానికి దోహదపడుతాయని అన్నారు. క్రీడలను శాంతి యుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. గురువారం నుండి క్రీడలు రసవత్తరంగా సాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లకొండ నాగయ్య, జిల్లా కబడ్డీ సెక్రటరీ నామాల నరసింహారావు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు కొల్లు విద్యాసాగర్, మండవ అచ్చయ్య, బాలేబోయిన ధనమూర్తి, నిర్వాహాకులు అమరగాని లింగరాజు, షేక్ పాషా, కొండా ఉదయ్, బాలేబోయిన గణేష్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
