రాష్ట్రా ముఖ్యమంత్రి తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రానున్న నేపథ్యంలో ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా ఎస్పీ, జెసి
సీఎం పర్యటన నిమిత్తం ఏ.ఎస్.ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్) నిర్వహణ.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.
జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్.,
ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడినుండి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్న నేపధ్యంలో ముందస్తు భద్రత చర్యలో భాగంగా (ఎ.ఎస్.ఎల్) ఏర్పాట్లపై రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా ఎస్పి శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్., . మరియు జె.సి. సమీక్షించారు..
రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం భద్రత పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా ఎస్పి శ్రీమతి మలిక గర్గ్ ఐ.పి.యస్., , జిల్లా జె.సి వారు, ఇతర శాఖల అధికారులతో రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు సమీక్ష నిర్వహించి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్., మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం ఎక్కడ రాజి పడకుండా డేగ కన్ను లాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పటిష్ఠమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి బద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయపరచుకుంటూ ప్రణాళికా బద్దంగా, సమిష్టిగా ముందుకు వెళ్లి పర్యటనకు భద్రత కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్,ఐపీఎస్., ఏఎస్పీ లు కులశేఖర్, శ్రీనివాస రావు,ఆర్డీవో శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, డీఎస్పీ లు ఎస్బి భాస్కరరెడ్డి, రేణిగుంట భవ్య కిషోర్, డిఎంహెచ్ఓ శ్రీహరి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.