పస్తాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
సాక్షిత తుంగతుర్తి ప్రతినిది: తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో శ్రీ ఆంజనేయ MACS సొసైటీ (PSYPA12521) లో వానాకాలం దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నాగారం తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవయ శాఖ అధికారులు, పస్తాల గ్రామపంచాయతీ కార్యదర్శి,రైతులు, శ్రీ ఆంజనేయ మ్యాక్స్ సొసైటీ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.
