కల్తీ మద్యంపై వైసీపీవన్నీ డ్రామాలే
** మాపార్టీ వాళ్ళని తెలిసి తక్షణమే సస్పెండ్
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
….
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: మద్యం కుంభకోణంతో ప్రపంచాన్నే ఊపేసిన జగన్ రెడ్డి అండ్ కో పార్టీ అయిన వైసీపీవి తాజాగా కల్తీ మద్యంపై చేస్తున్నవన్నీ పూర్తి డ్రామాలే అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ మండిపడ్డారు. చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తో కలసి మీడియా సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ మద్యంపై వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీలు , నిరసనలు , వినతి పత్రాల సమర్పణ అంటూ డ్రామాలు చేయడం , తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ పార్టీ ముసుగులో
నేరాలు , ఘోరాలు చేయడం , అవి ఇతరులకు అంటగట్టడం వైకాపా నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు.
అసలు కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్ రెడ్డే అని…, కల్తీ మద్యం కుట్ర దారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్ ది అని ఆరోపణలు చేశారు. మద్యం మాఫియాతో లబ్ది పొందినది జగన్ అని… మద్యం అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది వైకాపా పార్టీ నే అన్నారు. జగన్ చేసిన అవినీతి, అక్రమాలను, పాపాలను ఎదుటి వారిపై నెట్టడంలో జగన్ అండ్ కో బ్యాచ్ పీ.హెచ్.డీ చేశారని దుయ్యబట్టారు. ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారీలోనూ.. అమ్మకాల్లోనూ ఆరితేరిన వైకాపా నాయకులు రాష్ట్రంలోని కల్తీ మద్యంలో సూత్ర దారులని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారని సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు కూడా చేశారని… ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలపై ప్రభుత్వం కఠిన
వైఖరిని అవలంబిస్తోందని చెప్పారు. తమ టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు..కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరి పల్లి జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేసి, తగిన విచారణ చేపట్టాలని
నిర్ణయించడం జరిగిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వ, తెలుగు దేశం పార్టీ నిబద్ధతకు నిదర్శనం కాదా అన్నారు. ఎవరో ఎక్కడో తప్పు చేస్తే దాన్ని ప్రభుత్వానికి, పార్టీకి అంటగట్టేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
వాస్తవాలను వక్రీకరించే
జగన్… మద్యం కుంభకోణంలో కొండత దోపిడీని కప్పిపెట్టుకొనే కుట్ర నాటకం ఆడుతున్నా రని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విజయవాడలో మీ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సంబంధించిన బార్ లో కల్తీ మద్యంవల్ల 6మంది చనిపోతే సమర్థించారు కదా జగన్ మోహన్ రెడ్డి.. అని ప్రశ్నించారు. మరి అప్పట్లో
మల్లాది విష్ణుని ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీకు మద్యం మాఫియాలో భాగస్వాములు కాబట్టి కదా..?అన్నారు. 2014లో గవర్నర్ పాలన సాగుతున్న సమయంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు
కల్తీ మద్యంతో అమాయకులను చంపేశారని తెలిపారు. అప్పట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 4 కేసులు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై 6 కల్తీ మద్యం కేసులు
నమోదయ్యాయి. కాకాణి గోవర్ధన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మద్యం వల్ల సర్వేపల్లిలో ఐదుగురు, కావలిలో ఒకరు
ప్రాణాలు కోల్పోయారని సురేంద్ర గుర్తు చేశారు. వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
గత ఐదు సంవత్సరాల పాటు మద్యంలో నాణ్యతను గాలికి వదిలేసిన జగన్ రెడ్డి ఇప్పుడు
డ్రామాలాడుతున్నాడని చెప్పారు. జగన్ పాలనలో జంగారెడ్డి గూడెంలోనే కల్తీ నాటుసారా తాగి 27 మంది పేదల ప్రాణాలు పోతే చర్యలు తీసుకోకుండా సమర్ధించారన్నారు. వైసీపీ హయాంలో మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యానికి బానిసైన వ్యక్తులు శానిటైజర్ తాగి 48మంది
చనిపోయారు. నేడు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారని సాక్షి లో తప్పుడు రాతలు రాస్తున్నారు..
మద్యం బాటిల్ పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మద్యం క్వాలిటీతోపాటు ఎక్కడ తయారు చేశారో
తెలుస్తోందని పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా పారదర్శక పాలనకు నిదర్శం అని ప్రజలు గుర్తించారని టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ సమావేశం లో టీడీపీ నేత మేషక్ కూడా పాల్గొన్నారు.
